కర్షకుడు
కర్షకుడు
కుక్కి మంచమే నీకు పట్టు పరుపులు
పట్టెడన్నమే నీకు పంచభక్ష్య పరమాన్నం
ఆలిపిల్లలే నీకు ఆస్తిపాస్తులు
పుడమితల్లే నీ ప్రత్యక్ష దైవం
నాగలి, పడుగులే ప్రాణ స్నేహితులు
నీవేదో నీ లోకం ఏదో
ఇతరుల సంగతి నీకొద్దు
అయినా నీవంటే ఎందుకో
ఈ సమాజానికి చిన్న చూపు
నీ ఊపిరిని ఆహారంగా మార్చి
ఈ సమాజానికి అందిస్తున్నందుకేమో!
-Dr.M.Bharathi
Comments
Post a Comment