Skip to main content

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

శ్రీలంక అధ్యాత్మిక యాత్ర”
6-1-19
"శివానంద ప్రభు" సారధ్యంలో యాత్ర చుట్టుకుంది శ్రీకారం
అధ్యాత్మికత కలగలసిన వినోదాల విహారం
దీనికి వేదిక కాగా "లంకా" పట్టణం
"చినకద్రిగామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో" యాత్ర ప్రారంభం 
ఆపై "మున్నేశ్వరం" శ్రీరామ స్థాపిత సైకత లింగం
మన్వారి రామలింగేశ్వర స్వామి దర్శనం
తరువాత తల్లి "భద్రకాళి" ఆశీర్వాదం

అనూరాధపురంలో 
అలనాడు సంగమిత్ర నాటిన అంకురం
కాగా జ్ఞాన బోధను చేసే "శ్రీ మహా బోధి వృక్షం"
శాఖోపశాఖలుగా ఇచట విలసిల్లుతున్నది బౌద్ధం 
అచటనే ఘనమైన "రత్నమలి మహాస్థూపం"
వేదికగా సువిశాల ప్రాంగణం
దర్శనార్ధం వేలాదిమంది ఆగమనం
ఆ దర్శనమే ఓ అద్భుతం 
చూసేందుకు రెండు కళ్ళూ చాలవన్నది పరమ సత్యం

చివరగా
“కేండీ హాలిడే రిసార్ట్” లో ఆరామం
ఈ రకంగా ముగిసినది యాత్రా “తొలిదినం















అనురాధపురం

రత్నమలి మహాస్థూపం

దూరం నుండి చూడగనే చాలా ఘనంగా అనిపించింది. అద్భుతంలా ఉంది. ఇంతలో బస్సు, ఇటుకలతో కట్టిన స్థూపాన్ని దాటి ముందుకు వెళ్ళింది. ఇదేమిటి! ఇక్కడ ఆపకుండా ముందుకు తీసుకు వెళ్ళి పోతున్నాడు డ్రైవరు అనుకున్నా. ఇంకా ముందుకు వెళ్ళి అదిగో బోధి వృక్షం అన్నారు.

అది శ్రీ మహా బోధి వృక్షమట. ఇది 288 BC లో నాటినదట

అశోకుని కుమార్తె సంగమిత్ర గయ నుండి బోధి వృక్షపు కొమ్మ ఒకటి తీసుకు వచ్చి ఇక్కడ నాటారట. కొమ్మే బోధి వృక్షము.

ఇక్కడకు బౌద్ధులు తెల్లని దుస్తులు ధరించి వస్తారు. ఇక్కడ ఎవరికీ ఇంగ్లీష్ గాని, హింది గాని అర్ధం కాదు. అందరూ గుంపులుగా గాని, ఒక్కొక్కరుగా కాని కూర్చుని చక్కగా ప్రార్ధనలు చేసుకుంటున్నారు. ప్రార్ధనలు తప్పించి వేరే శబ్దం వినిపించడం లేదు. ఎంతమంది ఉన్నా అక్కడ నిశ్శబ్దం గా ఉన్నట్లే ఉంది.

అక్కడ ఉన్న మందిరంలో బుద్ధుని విగ్రహం ఉంది. చాలా అందంగా ఉంది.. బుద్ధుడికి మన వీపు చూపించకూడదని, సెల్ఫీలు తీసుకోవద్దని అక్కడ పోలీసులు చెప్పారు. ఇంకా చూడాల్సినవి ఏమున్నాయి అని గైడ్ ను అడిగితే ఒక వేపుకు చెయ్యి చూపిస్తూ అక్కడ స్థూపం ఉంది. వెళ్ళండి అన్నాడు. అటువేపు దూరం నుండి కూడా ఏమీ కనిపించ లేదు. ముందు దాటి వచ్చిన స్థూపం దగ్గరకు వెళ్దామా అంటే అలా కాదు. అటు వెళ్ళండి అన్నాడు. సరే అక్కడ ఏముందో! తొందరగా చూసి, దాటి వచ్చిన స్థూపాన్ని వెలుతురు ఉండగానే ఫోటోలు తీసుకుందామని వెళ్ళాము.

త్రోవలో రాతి స్తంభాలు నిలువుగా పాతి ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఏమిటో ఎవరూ చెప్పలేదు.

అలా చాలా దూరం వెళ్ళాక దూరంగా ఒక స్థూపం కనిపించింది. దగ్గరకు వెళ్ళిన వరకూ అది ఎంత పెద్ద స్థూపమో అర్ధం కాలేదు. దగ్గరకు వెళ్తున్న కొలదీ అద్భుతంగా అనిపిస్తుంది. దాని ఎత్తు 338 అడుగులు, చుట్టుకొలత 951 అడుగులు. తెల్లని రంగులో మెరిసిపోతుంది.. దీని ముందు, ముందు చూసిన స్థూపం కొంచెం కూడా ఆనదు. ఇది చూడక మునుపు అదే బ్రహ్మాండంగా అనిపించింది. ఇప్పుడు స్థూపం ఏమీ కాదు.

 స్థూపం చుట్టూ చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. ప్రాంగణం బయట ప్రాకారం. ప్రాకారం చుట్టూ ఏనుగులు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి.

మాలో ఒకరు మనమూ పరిక్రమ చేద్దామా అన్నారు. సరే అని కొంత మందిమి బయలుదేరాం. కొంతమంది ఉండి పోయారు చెయ్యలేమని. పరిక్రమ చేస్తుంటే ఎంతకీ తరగడం లేదు. నాలుగు వేపులా ముఖ ద్వారాలు ఉన్నాయి. అనీ ఒకేలా ఉన్నాయి. ఎక్కడ బయలు దేరామో అర్ధం కావడం లేదు. అంత పెద్ద ప్రాంగణం. హంసల్లా భక్తులు. ఇలా చూడడం గొప్ప అనుభవం

అందరూ ధవళ వస్త్రాలలో ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటూ ఉన్నారు. అందరూ కలువ పువ్వులను అర్పిస్తున్నారు. కలువలు కూడా చాలా అందంగా, తాజాగా, పెద్దగా ఉన్నాయి. చుట్టూ చాలా విశాల ప్రాంగణం. అక్కడక్కడ టేబుళ్ళు ఉన్నాయి. వాటి మీద కలువలను పెట్టి ప్రార్ధనలు చేసుకుంటున్నారు. ఎంత మంది ఉన్నా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అక్కడక్కడ వారి మత పెద్దలు కుర్చీ మీద కూచొని ఉంటే వారి చుట్టూ భక్తులు కూచుని వారు చెప్పినవి చాలా నిశ్శబ్దంగా వింటున్నారు. ఎక్కడకక్కడ ప్రవచనాలు, ప్రార్ధనలు, గీతాలాపన జరుగుతున్నాయి. ఒక్కరూ స్థూపానికి వీపు చూపించడం లేదు.అన్ని వందల, వేల మంది ఉన్నా, స్పీకర్ లలో ప్రవచనాలు చెబుతున్నా గోలగా అనిపించలేదు. చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లే ఉంది.   అంత క్రమశిక్షణ మన తెలుగు వాళ్ళలో ( తెలుగు వారనే ఏముంది. మన భారతీయులలో) కనిపించదు. ప్రాంగణమంతా చాలా పరిశుభ్రంగా ఉంది.

దీపాలు బయట పెడుతున్నారు. అవి పెట్టడానికి ప్రత్యేకంగా గదులు కట్టి ఉన్నాయి.

అదో అద్భుత అనుభవం, జన్మ ధన్యమయిందని అనిపిస్తుంది అక్కడ ఉండడం. కాళ్ళు నొప్పి పెడుతున్నా అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో! వీలైతే మాత్రం అనుభవాన్ని మిస్ కావొద్దు. ఎంతో ఉన్నతమయినది దర్శించామన్న అనుభూతి. మాటలలో అయితే చెప్పలేను. అనుభూతించి తీరవలసినదే.




P.S.:పై వివరాలు చదివాక మీ స్పందన (comment) ను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.










Comments

  1. ������. It is very nice poetic narration of Sri Lanka tour. It shows the ability to understand systematically all that comes under your observation in the journey that portrays to relay a series of visiting places in emotionally/spiritually engaging way. Interesting part of your expression is that it conveyed in chronological order, the order in which visits to places unfold from first to last of the day. This expression is a perfect blend of covering the much of the places of religious /spiritual significance. At times in your tour , journey seems to be stressful but your expression shows that it is not stressed but blessed rather at every point. The noteworthy thing is the expression of your feelings which perceived through this tour is an interesting array and comprehensive idea which involves an intricate layering of beliefs, customs, traditions etc., which projected the wholesome of Sri Lanka. This tour turned to pilgrimage as you felt day by day that distance travelled is less important than the experience gained. About the AsokaTree ( AsokaVatika ), the meeting of Hanuman with Sita maatha has been nicely described and about the footprints of Lord Hanuman reminds His existence. At the end, the mentioning of place where Maa Sita proved her purity by undergoing a fire ordeal is very heart touching. Prof K.Chandra Mouli

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కైలాస మానస సరోవర యాత్ర- నా అనుభవాలు

Varanasi tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to 23-3-20)