చేయాలని ఉంది
చేయాలని ఉంది
చేయాలని ఉంది ఏదో చేయాలని ఉంది
చేసి నా దేశ చరిత్రనే మార్చాలని ఉంది
వేళ్ళు పాతుకుపోయిన అవినీతిపై
వాయువు వలె విజృంభించాలని ఉంది
దేశద్రోహులు, లంచగొండులపై
మధ్యాహ్న మార్తాండునివలె ప్రజ్వరిల్లాలని ఉంది
నిరక్షరాస్యత, నిరుద్యోగములను
వరుణినిలా తుడిచి వేయాలని ఉంది
వరకట్నం, అత్యాచారాలపై
మూడవ నేత్రాన్ని తెరవాలని ఉంది
ఆకలితో అలమటించే నా దేశ ప్రజలపై
అమృతాన్నై వర్షించాలని ఉంది
విద్యావంతులు, మేధావులపై
చల్లని వెన్నెలై కురవాలని ఉంది
చేయాలని ఉంది ఏదో చేయాలని ఉంది
చేసి నా దేశ చరిత్రనే మార్చాలని ఉంది
-Dr.M.Bharathi
Comments
Post a Comment