ప(పు)రుష ప్రపంచం
ప(పు)రుష ప్రపంచం
ఒంటిని కప్పిపుచ్చేందుకు
సరిపడా గుడ్డల్లేని నేను
అతుకులేసుకుని బయటకెడితే
అయ్యో అని విచారిస్తారు
ఎందుకు? ఒంటినిండా బట్టలేదని కాదు
ఆ మాత్రం బట్ట కూడా ఉండిపోయిందే అని
ఆకలికి తట్టుకోలేక నే చచ్చిపోతే
అయ్యో అని విచారిస్తారు
ఎందుకు? సాటి వ్యక్తి చనిపోయిందన్న జాలితో కాదు
నా ఆకలికి వారి ఆకలిని ముడిపెట్టి
కోరిక తీర్చుకునే అవకాశం పోయిందని
కాని చరిత్ర పుటల్లో నా దేశం లోని
స్త్రీ మూర్తికి అంజలులు ఘటిస్తారు వీరంతా
-Dr.M.Bharathi
Comments
Post a Comment