ప్రకృతి
ప్రకృతి
ఉషఃసంధ్య నవ యవ్వనంతో,
పసితనపు చీకట్లు తొలగించుకుని దర్శనమిస్తే,
ఆ అద్భుత సౌందర్యానికి అచ్చెరువొంది
అదేపనిగా చూస్తుంటే, సిగ్గుపడిపోయి
ఎర్రబారిన మోముతో సాయంసంధ్యై
పశ్చిమానికి ఒదిగి నిల్చుంటే
నీలిమబ్బును పిల్లగాలుల తేరుపై
రాయబారానికి పంపించా
ఒకసారి ముఖమైనా చూపించమని
ఉహూ!చూస్తుండగానే
అదృశ్యమైపోయింది పడమట కనుమలలో
నిరాశగా నిట్టూర్చేంతలో
వెన్నెలను వల్లెవాటు వేసుకుని
నక్షత్రాల పూలు తురుముకుని
మబ్బులనడుమ తొంగిచూస్తూ
దోబూచులాడుతోంది ప్రకృతి కన్య నాతో
- డా.భారతి
Comments
Post a Comment