విశాఖ 19-1-2016

విశాఖ
19-1-2016

ఒక పక్కన అఖండ జలరాశి
ఆపక్కన అందాల కైలాసగిరి
దాని పక్కన ఆధ్యాత్మిక సింహగిరి 
ఇంకోపక్కన డాల్ఫిన్స్ నోసుగా
ఫ్రసిద్ధి చెందిన తూరుపు కనుమల సానువులు
వాటిక్రింద సహజసిద్దమైన నౌకాశ్రయం
విశాఖ అందాలను ఇనుమడింపచేస్తుంటే

చరక సంహితల కొలువు -
ఆంధ్ర వైద్య కళాశాల
చదువుల భాండాగారం-
ఆంధ్ర విశ్వ విద్యాలయం 
దేశ కీర్తిని రెపెరెపలాడించే-
తూర్పు నావికాదళం
ఆంధ్రుల హక్కు -
విశాఖ ఉక్కు కర్మాగారం
నౌకా నిర్మాణ రంగంలో ముందున్న -
హిందూస్తాన్ షిప్ యార్డ్
రాస్ హిల్ పై కొలువైన
దేవాళయం, మసీదు, చర్చ్
విశాఖ కీర్తిని నలుదెసలా చాటుతుంటే

ఏ ప్రాంతం వారినైనా సహృదయంతో ఆదరించే
మంచిమనసుల మనుషులు
అన్ని మతాలు మావే  
అని కలిసికట్టుగా మెలిగే విశాల హృదయులు 
విశాఖ కీర్తికి మరింత వన్నెలద్దుతుంటే 

ఈ విశాఖ
మన విశాఖ-మదిని దోచే విశాఖ 
సుజనుల విశాఖ-సహృదయపు విశాఖl
ఆందాల విశాఖ-ఆనందాల విశాఖ

                డా.మజ్జి భారతి

Comments

Popular posts from this blog

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

Puri, Bhuvaneswar Tour (పూరీ, భువనేశ్వర్ యాత్రా విశేషాలు) 7-11-19 To 10-11-19

Nepal Tour (నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర) 9-4-18 to 24-4-18