ప్రస్థానం (1-6-2017) నా ఆంధ్ర వైద్య కళాశాల
1-6-2017
ప్రస్థానం
నా ఆంధ్ర వైద్య కళాశాల
ఎందరో మహనీయుల కొలువు
భావితరాలకు నెలవు
గుర్తుకొస్తే మోమున మొలిపించు నగవు
అమాయకంగా, అయోమయంగా పదం మోపి
రాగింగ్ పేరుతో భీతిల్లి
సహ విద్యార్ధుల స్నేహం పొంది
సీనియర్ సహచరుల పరిచయం నొంది
తిరిగి చూస్తే వత్సరం గడిచేపోయింది
బయోకెమిస్ట్రి పరీక్ష ముందు నిలిచింది
అది గడిచి ఆరు నెలలు కాకుండానే
మేమున్నాయన్నాయి అనాటమి, ఫిజియాలజి
అవి గట్టెక్కి పడ్డాం కొండ అవతల
అడుగు పెట్టాం కెజిహెచ్ లో
చేరింది మెడలో కొత్త భూషణం
గుండె సవ్వళ్ళు వినే సాధనం
దానికి జతగా knee hammer
నాడీ మండలాన్ని శోధించే పరికరం
Ward postings
Case presentations
Wardmates' teasings
Grand rounds
తెల్లకోటు వేసుకుని
స్టెతస్కోప్ ఊపుకుంటూ
రోగుల మధ్య నడుస్తుంటే
ఆకాశంలో విహరిస్తున్నట్టు
ఏదో ఏదేదో సాధించేసినట్టు
చూస్తుండగనే గడిచాయి మరో మూడేళ్ళు
మధ్యలో ఎన్నో పరీక్షలు
భయాలు, విజయాలు
మధ్య మధ్యలో విహార యాత్రలు
వీటన్నిటి నడుమా మేమున్నామంటూ
వచ్చాయి ఫైనల్ ఇయర్ పరీక్షలు
ప్రాక్టికల్స్ అవగానే
రిజల్ట్స్ కై ఎదురుచూపులు
ఆపై మన పేరు జూనియర్ డాక్టర్స్
కళ్ళు మూసుకుటే గడిచింది సంవత్సరం
చేతికందింది డాక్టరుగా పట్టా
కన్నతల్లి లాంటి ఎ.ఎం.సి.
కన్నతండ్రి లాంటి కెజిహెచ్
సహోదరుల్లాంటి స్నేహితులు
దిశానిర్దేశం చేసే గురువులు
ఇవ్వాలంటే వీళ్ళకి వీడ్కోలు
చేరాయి కళ్ళల్లో నీళ్ళు
మిగిలాయి ఎన్నో జ్ఞాపకాలు
మరెన్నో తీయని అనుభూతులు
ఇదే మన ప్రస్థానం
డాక్టరైన ప్రతి ఒక్కరి అనుభవం
మిగిలిన ఓ కమ్మని జ్ఞాపకం
జీవితాంతం మనతో సాగే ఓ అద్భుతం
డా.మజ్జి భారతి
Comments
Post a Comment