ఎండాకాలం

ఎండాకాలం

2-6-2015
ప్రచండ భానుని ప్రకోపానికి
లోకం భగ భగ మండిపోయి
పచ్చని చెట్లు ఎండిపోయి
వరుణుని రాకకై లోకం
ఎదురు చూస్తున్న తరుణాన 
మబ్బుల చీరను చుట్టుకుని
ఆకాశం మబ్బు రంగులో కానవస్తుంటేl

గుండెలదిరేలా ఉరుములు
కర్ణపుటాలను తాకుతుంటే
మెరుపుల తీగలు
ఆకాశాన్ని పుడమిని కలుపుతుంటే
మేఘాలను చీల్చుకుంటూ
చినుకు చినుకు నేల జారుతుంటే

ఎండి బీటలు వారిన పుడమితల్లి
రెండు చేతులూ చాచి
ఆ చినుకును అక్కున చేర్చుకుంటుంటే
కమ్మని మట్టి వాసన
నాసికా పుటాలను తాకుతుంటే
ఇంతకన్నా  ఆనందం ఉంటుందా ఇలలో
 
             డా. మజ్జి భారతి

Comments

Popular posts from this blog

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

కైలాస మానస సరోవర యాత్ర- నా అనుభవాలు

Varanasi tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to 23-3-20)