Posts

Varanasi tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to 23-3-20)

Image
Kasi, Prayag & Ayodhya tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to 23-3-20) వారణాసి వెళ్లాలని ఎప్పుడూ కోరిక కలగలేదు. ఎందుకో తెలియదు మరి. బహుశా కాశీ వెళ్ళిన ఒకామె కాశీ అంతా బురద బురదగా ఉంటుంది. కోవెల కు వెళ్ళే త్రోవలో అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు. త్రోవంతా ఆవులు వుంటాయి. వాటి పేడ ఉంటుంది. అని వినడం కారణం కావొచ్చు. మరొకరు ఏమన్నారంటే, ఇవన్నీ ఉన్నా, మరల కాశీ వెల్లాలనిపిస్తుంది అని. శివుడు నాకెప్పుడూ అవకాశం ఇస్తాడా అని మాత్రం ఎదురు చూసాను. ఆ అవకాశం రానే వచ్చింది మా వారి రూపంలో  & డా . హనుమంత రావు గారి రూపం లో. మా వారికి  కాశీ వెళ్లి తొమ్మిది రాత్రులు అక్కడ ఉండాలని కోరిక. మేము భువనేశ్వర్ మీదుగా కాశీ చేరుకున్నాం. వర్షం పడుతుంది. అందుకు రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. Hotel Gateway Kailas లో దిగాం. మేమున్న హోటల్ ఎదురుగా గేట్ నెంబర్ 1 (ఆది శంకరాచార్య గేట్ ) . అక్కడనుండి 100-150m దూరం ఉంటుందేమో   విశ్వనాథుని కోవెల. కాశీ విశ్వనాథుని దర్శనం అంటే మాటలా! మనం అనుకుంటే చాలదు. శివుని ఆజ్ఞ కావాలి అంటారు. ప్రతి హిందువూ    చనిపోయేలోగా ఒక్కసారైనా ...