Puri, Bhuvaneswar Tour (పూరీ, భువనేశ్వర్ యాత్రా విశేషాలు) 7-11-19 To 10-11-19
Puri & Bhuvaneswar tour చార్ ధాం యాత్రలో ఉన్న నాలుగు ధామాలలో పూరీ ఒకటి . మిగిలినవి రామేశ్వరం , ద్వారక , బదరీనాధ్ . ఎప్పటినుండో అనుకుంటుంటే ఇప్పటికి ప్రాప్తించింది ఇక్కడకు రావడం పూరీలో సముద్ర స్నానం కోసం బీచ్ కు వెళ్ళాం . బీచ్ వైజాగ్ లోలా ఏటవాలుగా లేదు . గట్టులాగ ఎత్తుగా ఉండి , వెంటనే డీప్ గా ఉంది . అందుకే నేను స్నానానికి వెళ్లకుండా ఒడ్డునే ఉన్నాను . నాతో వచ్చిన వాళ్లు నీటిలో దిగారు . పెద్ద అలలు వస్తున్నాయి . అలా రెండు అలలు వచ్చినపుడు , ఒకరిని మీదకు తోసేసింది . మరో ఇద్దరిని మొత్తం ముంచేసింది . కొంచెంలో ప్రమాదం తప్పింది. అదే లోపలకు లాగేసి ఉంటే .... బహుశా ఈ టూర్ గురించి నేను రాసి ఉండనేమో . అక్కడ నుండి వెంటనే రూం కు వెళ్ళి ఫ్రెష్ అయి దర్శనాలకు బయలు దేరాం . సముద్ర స్నానం చేయాలనుకునే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని చేస్తే తరువాత విచారించ వలసిన అవసరం రాదు . పిల్లలున్నప్పుడు ఇంకా జాగ్రత్త అవసరం . చోటా గోపాల్ టెంపుల్ కు వెళ్ళాం . ఇక్కడ రాధా కృష్ట్నుల మూర్తులు ఉన్నాయి . నరేంద్ర టాంక్ కు