Posts

Showing posts from May, 2020

కైలాస మానస సరోవర యాత్ర- నా అనుభవాలు

Image
కైలాస మానస సరోవర యాత్ర (9-6-19 to 30-6-19)   కైలాస మానస సరోవరం యాత్ర చేయాలని సంకల్పం కలిగిన నుండీ , ( సుమారు 6 నెలల ముందు నుండీ ) అందుకు సంబందించిన సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టాం నేను , జయంతి గారు ( శ్రీలంక టూర్ లో పరిచయమయ్యారు ), డా . శైలజ ( నా కొలీగ్ ). నెట్ లో సెర్చ్ చెయ్యడం , కైలాస మానస సరోవరం యాత్ర చేసిన వాళ్ళతో మాట్లాడడం , వారి అనుభవాలూ , ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి , మానసికంగా ఎలా సిద్ధం కావాలి , ఇలా అన్నీ తెలుసుకునే వాళ్ళం .   ప్రాణాయామం చెయ్యాలి , వాకింగ్ చెయ్యాలి , యోగా , వ్యాయామం చెయ్యాలి , వీలైతే కొండలు ఎక్కాలి , ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి .... ఎందులోనైనా ఇవే ముఖ్యాంశాలు . వీలైనంత వరకూ పాటించడం మొదలు పెట్టాం . ట్రెక్కింగ్ షూష్ తోనే నడక అలవాటు చేసుకోవాలి , అదీ కొన్ని నెలలు ముందునుండీ . ఇది నాఫ్రెండ్ ఉమాదేవి చెప్పింది . వాళ్ళు లాస్ట్ ఇయర్ వెళ్ళారు . వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు మా గురువు గారు డా . వెంపటి . రామనరసింహం గారిని కలిసాను . వారు “ మానస సంచరరే” అన్న పుస్తకం కూడా ఈ యాత్ర