Posts

Showing posts from June, 2015

ఎండాకాలం

ఎండాకాలం 2-6-2015 ప్రచండ భానుని ప్రకోపానికి లోకం భగ భగ మండిపోయి పచ్చని చెట్లు ఎండిపోయి వరుణుని రాకకై లోకం ఎదురు చూస్తున్న తరుణాన  మబ్బుల చీరను చుట్టుకుని ఆకాశం మబ్బు రంగులో కానవస్తుంటేl గుండెలదిరేలా ఉరుములు కర్ణపుటాలను తాకుతుంటే మెరుపుల తీగలు ఆకాశాన్ని పుడమిని కలుపుతుంటే మేఘాలను చీల్చుకుంటూ చినుకు చినుకు నేల జారుతుంటే ఎండి బీటలు వారిన పుడమితల్లి రెండు చేతులూ చాచి ఆ చినుకును అక్కున చేర్చుకుంటుంటే కమ్మని మట్టి వాసన నాసికా పుటాలను తాకుతుంటే ఇంతకన్నా  ఆనందం ఉంటుందా ఇలలో                డా. మజ్జి భారతి